IPL 2023: నేడు పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ..

by Vinod kumar |   ( Updated:2023-05-16 18:46:02.0  )
IPL 2023: నేడు పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో 8 వ ప్లేస్‌లో ఉన్న పంజాబ్‌తో చివరి ప్లేస్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొట్టబోతున్నది. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది నామమాత్రపు మ్యాచ్. ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడగా.. 6 గెలవగా.. 8 వ ప్లేస్‌లో కొనసాగుతున్నది. ఢిల్లీ 12 మ్యాచ్‌లో కేవలం 4 మాత్రమే గెలిచి.. చివరి ప్లేస్‌లో ఉన్నది.

పంజాబ్ కింగ్స్ తుదిజట్టు (అంచనా):

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (c), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (wk), సామ్ కర్రాన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు (అంచనా):

డేవిడ్ వార్నర్ (c), ఫిలిప్ సాల్ట్ (WK), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, మనీష్ పాండే, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

Advertisement

Next Story