- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cyber Alert: ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని క్రికెట్ అభిమానులకు వల వేస్తుంటారు. తమ వద్ద ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఉన్నాయని ఫేక్ అకౌంట్‌లో మ్యాచ్ టికెట్లు ఉన్నాయని పోస్టులు చేసి. టికెట్స్‌పై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతుంటారు. కొందరూ నమ్మి వారు అడిగినంత డబ్బులు ఆన్‌లైన్ పేమెంట్ చేశాక చివరికి టికెట్ మాత్రం ఇవ్వరు. దీంతో బాధితులు మోసపోయామని గ్రహిస్తారు.. కానీ బాధితులు మాత్రం మోసపోయినట్టు బయటకు చెప్పుకోవడం లేనట్లు సమాచారం. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న హైదరాబాద్ సన్రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సైబర్ ముఠా సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు.
టికెట్ కావాలంటే పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. 48 గంటల్లో టికెట్లు స్టేడియం దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చని మెసేజులు చేస్తున్నారు. మరోవైపు కొందరూ టికెట్లు సోషల్ మీడియా వేదికగా బ్లాక్‌లో కూడా అమ్ముతున్నారు. కాగా, తాజాగా చెన్నైలోని ట్రిప్లికేన్‌లో శుక్రవారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోసం ఐపీఎల్ టిక్కెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించారనే ఆరోపణలపై ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది టిక్కెట్లు, 31,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై వారిని విడుదల చేశారు.