- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
24 గంటల్లో దొంగతనం కేసును చేధించిన వేములవాడ రూరల్ పోలీసులు..
దిశ, వేములవాడ : దొంగతనం జరిగిన 24గంటల్లోనే దొంగలను గుర్తించి, కటకటాల్లోకి పంపారు వేములవాడ రూరల్ మండల పోలీసులు. ఈ మేరకు మంగళవారం రూరల్ సీ.ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి దొంగతనం వివరాలు వెల్లడించారు. మండలంలోని రాజానగర్(మల్లారం)కి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ ఇంటి పునరుద్ధరణలో భాగంగా తన ఇంటికి కలర్ వేయడానికి వేములవాడ కు చెందిన నందెల్లి అనిల్ కుమార్, సయ్యద్ అఫ్రోజ్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి రంగులు వేయడానికి ఒప్పందం చేసుకొగా, గత నెలరోజులుగా ఇంటికి రంగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 8న శ్రీనివాస్ తన భార్య కలిసి బెజ్జంకి వెళ్లి వచ్చేసరికి ఇంటిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. అనుమానంతో ఇల్లు అంత వెతకగా బ్యాగ్ కనిపించలేదు.
బ్యాగ్ లో 25 గ్రాముల బంగారం ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లి నట్లు గుర్తించి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఎస్.ఐ మారుతి, సిబ్బంది తో టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా ఇంటికి కొద్దీ దూరంలో బ్యాగ్ కనిపించింది . బ్యాగ్ పై కలర్ మరకలు ఉండగా ఇల్లుకు కలర్ వేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను రాజనగర్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం తామే చేసినట్టుగా ఒప్పుకోగా వారి వద్ద నుండి 25 గ్రాముల బంగారం సీజ్ చేసి వారిని ఈ రోజు రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే దొంగతనం కేసును చేధించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ మారుతి, సిబ్బంది తిరుపతి, శంకర్, యాకూబ్, రాజశేఖర్, వెంకటేష్ లను ఏఎస్పీ అభినందించారు.