ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు హతం

by GSrikanth |
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు హతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమినాడులో జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. ఈ ఘటన చెన్నైలో ఇవాళ తెల్లవారుజామున కాంచీపురం రైల్వే బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. మృతులను రఘు, అసన్‌గా గుర్తించారు. కాంచీపురంలో ప్రభాకర్ అండ్ గ్యాంగ్ ఓ హత్య చేశారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారని, దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు వెల్లడించారు.

Advertisement

Next Story