గణేశుని మెడలో కరెన్సీ నోట్ల హారం మాయం..

by Sumithra |
గణేశుని మెడలో కరెన్సీ నోట్ల హారం మాయం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆదివారం చోరీ జరిగింది. పట్టణంలోని చైతన్య కాలనీలో మణికంఠ కిరాణ దుకాణంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాప్ లో చోరీ జరిగిన విషయాన్ని సోమవారం ఉదయం స్థానికులు గమనించారు. కిరాణ దుకాణం షట్టర్లను ఇనుప రాడ్లతో ధ్వంసం చేసి పైకి లేపారు. షాపులోని రూ.50 వేల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అలాగే ఇదే కాలనీలోని గణేష్ మండపంలో గణేశుని మెడలో అలంకరించిన కరెన్సీ నోట్ల హారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఈ విషయం పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story