road accident : బస్సు ఢీ.. వృద్ధుడు మృతి

by Sumithra |
road accident : బస్సు ఢీ.. వృద్ధుడు మృతి
X

దిశ, ఉప్పల్ : బస్ ఢీకొని వృద్ధుడు మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాల జిల్లాకు చెందిన కుర్వ రాములు (80) ఉప్పల్ కల్యాణ పూరిలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, నలుగురు కూతుర్లు, తన సొంత ఊరికి వెళ్లి నిన్న ట్రైన్ లో కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు.

అక్కడి నుంచి బస్ లో ఉప్పల్ రింగ్ రోడ్డుకి చేరుకున్నాడు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా చెంగిచర్ల డిపోకు చెందిన బస్సు ఢీ కొట్టడంతో కింద పడిపోయాడు. బస్ ముందు టైరు కాలు మీద నుంచి పోవడంతో కాలు నుజ్జు నుజ్జు అయింది. అక్కడ ఉన్న స్థానికులు 108 కి ఫోన్ చేయగానే అంబులెన్సు లో వైద్యం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి వృద్దుడు మృతి చెందాడు. తన కుమారుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story