- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైట్‌గోల్డ్ వద్ద ఘోర ప్రమాదం.. తల్లి, కుమారుడు దుర్మరణం
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం-రాయపోలు మార్గంలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ డీసీఎం వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రాయపోలు మార్గంలోని వైట్‌గోల్డ్ వద్ద గురువారం సాయంత్రం ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు తల్లి పార్వతమ్మ(56), కుమారుడు భాను(25) గా నిర్ధారించారు. వీరిది దండుమైలారం గ్రామంగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story