ఏసీబీ వలలో జలమండలి మేనేజర్

by Sridhar Babu |
ఏసీబీ వలలో జలమండలి మేనేజర్
X

దిశ‌, గండిపేట్ : నల్లా కనెక్షన్లను ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి ఓ జలమండలి అధికారిణి ఏసీబీకి చిక్కింది. ఆమెతో పాటు అదే కార్యాల‌యంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి సైతం పట్టుబడ్డాడు. మణికొండ నెక్నాంపూర్ శ్రీ వెంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్ రెడ్డికి రెండు న‌ల్లా కనెక్షన్ల విషయంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ శివరాజ్ బోర్డ్ మణికొండ మేనేజర్ స్ఫూర్తి రెడ్డి రూ.30 వేలు డిమాండ్ చేశారు. ఈ లంచాన్ని అదే ఆఫీసులో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ గౌడ్ కు అందించాలని చెప్పడంతో ఉపేంద్రనాథ్ రెడ్డి

ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథ‌కం ప్రకారం నవీన్ గౌడ్ ను పిలిచి రూ.30 వేలను కార్లో ఇచ్చారు. డబ్బులను తీసుకున్న నవీన్ గౌడ్ మేనేజర్ స్ఫూర్తి రెడ్డికి వాట్సాప్ ద్వారా డబ్బులు అందినట్లు సమాచారం అందించాడు. దీంతో వెంటనే ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకొని కేసు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా అతని చేతి ముద్రలు కెమికల్ టెస్ట్ లో నిర్ధారణ అయినట్లు గుర్తించారు. ఈ మేరకు వారిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ లు ఆజాద్, జగన్మోహన్ రెడ్డి, ఎస్ఐ శివశంకర్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed