కాకతీయ కాలువలో పడి వ్యక్తి గల్లంతు..

by Sumithra |
కాకతీయ కాలువలో పడి వ్యక్తి గల్లంతు..
X

దిశ, బాల్కొండ : మెండోరా మండలం ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో పడి ద్యారంగుల చిన్న మారెన్న (32) గల్లంతైనట్లు మెండోరా ఎస్సై నారాయణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ద్యారంగుల చిన్న మారెన్న మెండోరా మండల కేంద్రంలో నివాసం ఉంటూ కూలి పని చేసుకుంటారని తెలిపారు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిస అయి బుధవారం ఉదయం నుంచి మద్యం తాగి సుమారు మధ్యాహ్నం 02:00 గంటలకు మెండోరా దగ్గర ఉన్న కాకతీయ కాలువలో పడి గల్లంతయ్యాడని, భార్య ద్యారంగుల రాజమణి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed