ఆస్తి కోసం చంపాలని చూస్తోంది..

by Sridhar Babu |
ఆస్తి కోసం చంపాలని చూస్తోంది..
X

దిశ, జగిత్యాల టౌన్ : ఆస్తి కోసం పినతల్లి జమున తనను చంపాలని చూస్తుందని ఆరోపిస్తూ హనుమల్ల మానస (22) అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. చిన్నతనంలోనే తన తల్లి చనిపోగా తండ్రి జమున అనే మహిళను రెండో వివాహం చేసుకున్నట్లు మానస తెలిపింది. అయితే ఇటీవల తన తండ్రి కూడా చనిపోవడంతో ఆస్తి కోసం పినతల్లి జమున తనని చంపడానికి ప్రయత్నిస్తుందని మానస ఆరోపించింది.

తండ్రి మరణానంతరం తనకు 13 లక్షలు, పినతల్లి జమునకు మూడు లక్షల వరకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో మాట్లాడుకుందామని పిలిచిన జమున తనపై దాడి చేసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడికి గురైన యువతి మానస వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా తనకు న్యాయం చేయాలంటూ మీడియాతో ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story