- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కీలక వ్యక్తుల పాత్ర వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. SBI మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, ఓ ఛానల్ ఎండీకి ఆదివారం నోటీసులు పంచించారు. ప్రణీత్ రావు అరెస్ట్‌తో ఈ ముగ్గురు విదేశాలకు వెళ్లడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్‌లో అదనపు ఎస్పీగా పని చేసిన ఆయన్ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు, తిరుపతి రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.