పోలీసుల పేరుతో డబ్బులు వసూలు

by Disha Web Desk 15 |
పోలీసుల పేరుతో డబ్బులు వసూలు
X

దిశ, మెదక్ ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు నాకు తెలుసు.. ఎమ్మెల్యే వెంటే ఉంటానని పోలీస్ ల పేరు చెప్పి బెదిరించి ఇసుక, ఇతర వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మెదక్ పట్టణ సీఐ దిలీప్ తెలిపారు. మెదక్ పట్టణం ఇందిరా పురి కాలనీలో నివాసం ఉండే అముద రఘు పోలీస్ ల పేరు చెప్పి మెదక్ లోని ఇసుక, ఇతర వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు తెలిపారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి తెలుసని, అతడి తమ్ముడితో మంచి సంబంధాలు ఉన్నట్టు వ్యాపారులతో చెప్పినట్టు తెలిపారు. ఎమ్మెల్యే తనవెంట ఉన్నాడని వ్యాపారులను బెదిరిస్తూ వారి వాహనాలు వెంబడించే వాడన్నారు. లాఠీ పట్టుకొని బెదిరిస్తూ దౌర్జన్యాలు చేసినట్టు చెప్పారు. ఇసుక దందా చేయవద్దని బెదిరిస్తూ ఉన్నతాధికారుల

నంబర్స్ సేకరించి సొంతంగా వాట్సప్​ యాప్ గ్రూప్ తయారు చేసి వారి పేర్లు చెబుతూ, వాటికి ఫోన్ చేస్తున్నట్టు నటిస్తూ వారి పేర్లతో డబ్బులు దోపిడీ చేసినట్టు వివరించారు. ఇసుక, ఇతర వ్యాపారులు చెప్పినట్టు వినకపోతే వ్యాపారం ముగించి వేస్తానని బెదించేవాడని అన్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశిస్తూ వారిపై అజమాయిషీ చేస్తూ డబ్బులు దోపిడీ చేశాడని తెలిపారు. అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వారిని తన దారికి అడ్డు రాకుండా చూసుకునే వాడని చెప్పారు. రఘు పై గతంలో అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేప్ కేసు ఉందని, అలాగే హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక దోపిడీ కేసు, మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కేసులు ఉన్నాయని తెలిపారు. పోలీస్ పేరు చెప్పుకొని, పోలీస్ గా నటిస్తూ దౌర్జన్యం చేసి దోపిడీ చేస్తూ పట్టుబడగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Next Story