- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులు రిమాండ్
దిశ,తుంగతుర్తి : హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తులను తుంగతుర్తి పోలీసులు పట్టుకొని రిమాండ్ చేశారు. సీఐ శ్రీను మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఎల్లబోయిన భిక్షం 2020లో వీరబోయిన మంజుల (తుంగతుర్తి నివాసి) కు చెందిన అన్నారం గ్రామ శివారులో ఉన్న 3.20 ఎకరాల భూమిని కొనుగోలు చేసుకుని సాగు చేసుకుంటున్నాడు. అయితే భిక్షం కొన్న భూమి తమదేనంటూ అన్నారం గ్రామానికి చెందిన గుండాల బుచ్చయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులు భూమిలోకి అక్రమంగా ప్రవేశించి గొడవలు చేస్తుండగా తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో వారిపై ఐదు కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో భిక్షం తుంగతుర్తి కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ పొందాడు. అయితే వీటిని లెక్క చేయకుండా గుండాల బుచ్చయ్య, గుండాల ఉప్పమ్మ, గుండాల మాధవితో పాటు ఆమె భర్త షేక్ అఖిల్ పాషలు కలిసి ఈ ఏడాది జూన్ 17న భిక్షం తన వ్యవసాయ భూమిలో ఉన్న సమయాన్ని చూసి ఆయనను చంపాలనే ఉద్దేశంతో అక్రమంగా ప్రవేశించి గొడ్డలితో దాడి చేశారు. ఈ క్రమంలో భిక్షం తప్పించుకోగా కూలికి వచ్చిన మారగాని శ్రీను అడ్డు వెళ్లారు. ఈ మేరకు ఆయన చేతికి గాయమైంది. అనంతరం భిక్షం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఏడుకొండలు నలుగురిపై కేసులు నమోదు చేశారు.
వీరంతా ఆనాటి నుండి తప్పించుకొని తిరుగుతుండగా తన సిబ్బందితో ఎస్సై అన్నారం గ్రామానికి మంగళవారం వెళ్లి గుండాల బుచ్చయ్య, గుండాల ఉప్పమ్మలను పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం తుంగతుర్తి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి నల్లగొండ జిల్లా జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించారని సీఐ శ్రీను తెలిపారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కబ్జాలో ఉన్న వారి భూమిలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం లాంటివి చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఆయన వివరించారు. సమావేశంలో ఎస్సై ఏడుకొండలు పాల్గొన్నారు.
- Tags
- remand