- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీకి పట్టుబడ్డ 16 ఏళ్లకు శిక్ష
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఏసీబీకి పట్టుబడ్డ 16 ఏళ్లకు ఓ అధికారికి నేడు శిక్ష పడింది. ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుతో పాటు కొత్త కనెక్షన్ ఇవ్వడానికి ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులో ఎన్ పీ డీ సీ ఎల్ (ఆపరేషన్స్) ఏఏఈ మచ్చ సదాశివ్ కు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ హైదరాబాద్ నాంపల్లి లోని ఏసీబీ కోర్టు సెకండ్ అడిషనల్ స్పెషల్ జడ్జి మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ తీర్పు వెలువరించినట్లు నిజామాబాద్ రేంజ్ ఏసీబీ డీ ఎస్ పీ శేఖర్ గౌడ్ మంగళవారం తెలిపారు. కేసు వివరాలిలా ఉన్నాయి. మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామంలో కొత్త ట్రాన్స్ ఫార్మర్, కొత్త కనెక్షన్లను ఏర్పాటు చేయడానికి మాక్లూర్ సబ్ స్టేషన్ లో ఏఏఈగా పని చేసిన మచ్చ సదాశివ్ రైతు కేసరి శ్రీనివాస్ రెడ్డి వద్ద రూ. 5 వేలు డిమాండ్ చేశారు.
బేరమాడి రూ. 3 వేలు ఇచ్చేందుకు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు. కానీ అధికారికి లంచం ఇవ్వడానికి మనసొప్పక శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏఈఈ మచ్చ సదాశివ్ కు జూలై 24, 2008 రోజున లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో ఏసీబీ తరపున హైదరాబాద్ కు చెందిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ శ్రీలక్ష్మి మనోజ్ఞ తన వాదనలు వినిపించగా, ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి హైదారాబాద్ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ శిక్షను ఏకకాలంలో వర్తించేలా తీర్పు చెప్పారు. ఒక వేళ జరిమానా డబ్బులు చెల్లించని పక్షంలో మూడు నెలలు అదనపు సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు.
- Tags
- punishment