suicide : అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

by Sridhar Babu |
suicide : అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
X

దిశ,టేకులపల్లి : గత నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయం కలిసిరాక తెచ్చిన అప్పులు ఎక్కువ కావడంతో బాధతో తాగుడుకు బానిసై పురుగుమందు తాగి యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. టేకులపల్లి ఎస్సై పి. సురేష్ తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన జాల ఉపేందర్(32) అనే రైతు తనకున్న రెండెకరాల భూమితో వ్యవసాయం చేస్తూ నాలుగు సంవత్సరాల క్రితం కొంత అప్పు తెచ్చి రెండు ఎకరాల భూమిని కొన్నాడు. ఈ నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నాడు. పంటలు సరిగా పండక తెచ్చిన అప్పులు ఎక్కువ కావడంతో

గత సంవత్సరం మిర్చిపై నష్టం రావడంతో అప్పుల బాధ భరించలేక గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. సోమవారం సాయంత్రం 8 గంటలకు చేనుకెళ్తున్నానని ఇంటి నుండి బయటకు వెళ్లిన ఉపేందర్ మద్యం మత్తులో గుర్తు తెలియని పురుగుమందు తాగి చేను వద్ద పడిపోయాడు. 7 గంటల సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు చూసి చెప్పడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. వారు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 11:30 గంటల సమయంలో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి తండ్రి జాల పెద్ద లాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఒక పాప, బాబు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed