HYD: మరో బాలుడి ప్రాణం తీసిన గాలిపటం

by GSrikanth |
HYD: మరో బాలుడి ప్రాణం తీసిన గాలిపటం
X

దిశ, వెబ్‌డెస్క్: పండగ పూట ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. సంక్రాంతి సెలవుల్లో దోస్తులతో సరదాగా గడపాలని భావించిన ఆ బాలుడు అంతలోనే అనంతలోకాలకు వెళ్లాడు. గాలిపటం ఎగరవేసేందుకు ఇంటిపైకి వెళ్లిన బాలుడు కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్‌ సమీపంలోని నాగోల్‌లో శివప్రసన్న(13) అనే బాలుడు గాలిపటం ఎగరేసేందుకు ఆదివారం ఉదయం ఇంటిపైకి వెళ్లాడు. ఈ క్రమంలో ఆడుకుంటూ వెనక్కి వెనక్కి వచ్చిన కాలుజారి ఇంటిమీద నుంచి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story