Tesla: భారత్ లో టెస్లా కార్లు ధరలు ఎంత ఉండొచ్చు? దేశీయ కంపెనీలకు పోటీ తప్పదా?

by Vennela |
Tesla: భారత్ లో టెస్లా కార్లు ధరలు ఎంత ఉండొచ్చు? దేశీయ కంపెనీలకు పోటీ తప్పదా?
X

దిశ,వెబ్‌డెస్క్: Tesla Car Price In India: అపర కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) కు చెందిన టెస్లా (Tesla Car)ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు సంస్థ భారత్ లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. త్వరలోనే తొలి కారు మన రూడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకపోవడం ఖాయంగా కనిపిస్తోంది. లగ్జరీ కార్లకు పట్టం కట్టే కొనుగోలుదారులు ఈ టెస్లా(Tesla Car) కారును ఆదరిస్తారనడంలోనూ ఎలాంటి సందేహం లేదు.

భారత్ ల టెస్లా కారు ధర(Tesla Car Price In India) ఎలా ఉంటుందన్న విషయంపై క్యాపిటల్ మార్కెట్ అండ్ ఇన్వెస్టిమెంట్ సంస్థ సీఎల్ఎస్ఏ(CLSA) తాజాగా ఓ రిపోర్టును సైతం విడుదల చేసింది. దీని ప్రకారం చూసినట్లయితే టెస్లా కారు(Tesla Car) ధర అంచనాలకు మించిపోతోంది. దిగుమతి సుంకాలను 20శాతం కంటే తగ్గించినప్పటికీ కూడా టెస్లా చీపెస్ట్ మోడల్ కారు ధర(Tesla Car Price In India) రూ. 35 లక్షల నుంచి రూ. 40లక్షల వరకు ఉంటుంది. అమెరికాలో టెస్లా హైఎండ్ మోడల్ 3 కారు రేటు ప్రస్తుతం దాదాపు 35,000డాలర్లు ఉంటోంది. దీన్ని కరెన్సీలోకి మార్చుకుంటే 30.4లక్షల రూపాయలపైమాటే ఉంటుంది. భారత్ లో దిగుమతి సుంకాలు 15 నుంచి 20శాతానికి తగ్గించిన తర్వాత కూడా రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి ఇతర ఖర్చులను కలుపుకుని ఆన్ రోడ్ ధర ఇప్పటికే 40,000డాలర్లను దాటుతోంది.

ఇక దీని విలువ భారత కరెన్సీలో పోల్చుకుంటే దాదాపు 35 నుంచి 40లక్షల రూపాయలు. టెస్లా మోడల్ 3ధర(Tesla Car Price In India) ను దేశీయ ఎలక్ట్రిక్ కార్లు, మహీంద్రా ఎక్స్ ఈవీ 9ఈ, హ్యుందాయ్ ఇ క్రెటా, మారుతి సుజుకి ఇ విటారాతో పోల్చుకుంటే 20 నుంచి 50శాతం అధికంగా ఉంటోంది. టెస్లా ఈవీ కారు ధర. ఇది టెస్లా కారు డిమాండ్ ను ప్రభావితం చేస్తుందని సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది.

25లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధర (Tesla Car Price In India) ఉంటేనే టెస్లా ఈవీ కారుకు మంచి మార్కెట్ ఉండొచ్చని పేర్కొంది. ఆన్ రోడ్ ధర బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటేనే కొనుగోలుదారులు ఇంట్రెస్ట్ చూపిస్తారని వివరించింది. అయినప్పటికీ టెస్లా రాక తర్వాత దేశీయ ఆటోమెటివ్ సెగ్మెంట్లో ఓ విప్లవాత్మక మార్పునకు బీజం పడుతుందని సీఎల్ఎస్ఏ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధానపర నిర్ణయాలను తీసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం భారత్ లో టెస్లా 4,150 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టగలిగితే ఏడాదికి 8,000 యూనిట్ల వరకు 15శాతం తక్కువ దిగుమతి సుంకాన్ని పొందేందుకు వెసులుబాటు ఉంటుంది.

ఒకవేళ టెస్లా (Tesla Car Price In India) కంపెనీ రూ. 25లక్షల ధరతో ప్రత్యేకంగా ఎంట్రీలెవల్ కారును తీసుకువచ్చినట్లయితే ఈ ధరలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తూన్న మహీంద్రా కంపెనీకి టెస్లాతో పోటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ కారణంతోనే చివరి స్టాక్ మార్కెట్ ట్రెడింగ్ సెషన్ లో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా నష్టపోయాయి. చైనా, యూరప్, అమెరికాలతో పోలిస్తే భారత్ లో ఈవీ వినియోగం తక్కువగా ఉంది. ఈ అంశాన్ని అందిపుచ్చుకునేందుకు టెస్లా భారత్ మార్కెట్ పై కన్నేసిందనే చెప్పవచ్చు.

Next Story

Most Viewed