Honda Rebel: భారత్ రోడ్లపైకి రాబోతున్న హోండా రెబల్.. ఎప్పటి నుంచి పరుగులంటే?

by D.Reddy |
Honda Rebel: భారత్ రోడ్లపైకి రాబోతున్న హోండా రెబల్.. ఎప్పటి నుంచి పరుగులంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దిగ్గజ వాహన తయారీ సంస్థ హోండా మరో కొత్త మోడల్ ప్రీమియం బైక్‌ను తీసుకురానుంది. ఇప్పటికే విదేశాల్లో మంచి ఆదరణ పొందిన రెబెల్ 300 (Rebel 300) బైక్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. అయితే దేశంలో ఇప్పటికే హోండా CB300R అనే మోడల్‌ను విక్రయిస్తుండగా, కొత్తగా తీసుకురాబోతున్న రెబెల్ 300 బైక్ కూడా అదిరిపోయే స్టైలిష్ లుక్‌‌తో, అధునాతన ఫీచర్స్‌తో తీసుకురానుంది. ప్రస్తుతం దేశంలో యువత కూడా ఎక్కువగా ఇలాంటి మోడళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో సంస్థ ఆ దిశగా దృష్టి సారిస్తుంది. మరీ హోండా తీసుకొస్తోన్న ఈ కొత్త బైక్ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

రెబల్ 300 బైక్ 286cc లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ నాలుగు వాల్వ్‌లతో కూడిన DOHC సెటప్, 10.7:1 కంప్రెషన్ రేషియో అలాగే 38mm థొరెటల్ బాడీతో వస్తుంది. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్‌ను జోడించారు. 500 rpm వద్ద 19.03 bhp పవర్‌ను, 7000 rpm వద్ద 17.55 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే.. 11.3 లీటర్ల వరకు ఉంటుంది. రైడింగ్‌లో రక్షణ అందించానికి డ్యూయల్-ఛానల్ ABS సిస్టంతో వస్తుంది. అలాగే, ముందు, వెనుక వీల్స్‌కు సింగిల్ డిస్క్ సెటప్‌ను అందించారు. ఇక దీని ప్రారంభం ధర రూ.2.35 లక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed