- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్తీ మద్యం కేసులో 9 మందికి ఉరి శిక్ష
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: బీహార్‌ను కుదిపేసిన 2016 కల్తీ మద్యం కేసులో తొమ్మిది మంది దోషులకు ఉరి శిక్ష పడింది. మరో నలుగురు మహిళలకు యావజ్జీవం శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ ప్రత్యేక ఎక్సైజ్ కోర్టు తీర్పు వెలువరించింది. వీరందరూ గతనెల 26న దోషులుగా తేలారు.
ఉరిశిక్ష పడిన దోషులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. 2016 ఆగస్టులో గోపాల్‌గంజ్ జిల్లాలో వీరు కల్తీ మద్యాన్ని విక్రయించారు. ఈ మద్యం తాగిన 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులపైనా వేటు పడింది. ముగ్గురు ఎస్‌ఐలు సహా 21 మంది పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం వహించారని సస్పెన్షన్‌కు గురయ్యారు.
Advertisement
Next Story