- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహంకాళేశ్వర ఆలయంలో ‘దేవి శరన్నవరాత్రులు’.. ఎప్పుడంటే?
దిశ, చార్మినార్ : మీరాలం మండి చారిత్రాత్మక శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ చైర్మన్గాజుల అంజయ్య తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రతీరోజు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవ, మహాభిషేకం, అలంకరణ, చతుషష్ఠి ఉపచార పూజ, పది పారాయణములు, ఛండీహోమం, పూర్ణాహుతి, నైవేధ్యం, నీరాజన మంత్ర పుష్పం, సాయంత్రం 5.30 గంటలకు మాతృమూర్తులచే సహస్రనామ కుంకుమార్చన, 6.30గంటలకు సహస్ర దీపోత్సవం, ఊంజల్‌సేవ, రాత్రి 8.05 గంటలకు పంచహారతి, సామూహిక హారతి, గౌరీపూజ, బతుకమ్మ, రాత్రి 8.30 గంటలకు అన్న ప్రసాదము, రాత్రి 11.35గంటలకు అమ్మవారికి ఏకాంత సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గాజుల అంజయ్య పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.