‘గబ్బర్ సింగ్’.. సోషల్ మీడియా కింగ్

by Jakkula Samataha |

రికార్డుల సునామీ..

గబ్బర్ సింగ్.. పవర్ స్టార్ స్టామినాకు చిన్న ఉదాహరణ. ఎనిమిదేళ్ల క్రితం రిలీజ్ అయి బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ ల రికార్డ్ బ్రేక్ చేసింది. 10 మిలియన్ ట్వీట్స్ తో ఇండియాలో మోస్ట్ ట్వీటెడ్ మూవీ యానివర్సరీ ట్రెండ్ గా రికార్డ్ సృష్టించింది. #8YrsOfGabbarSinghHysteria హ్యష్ టాగ్ తో ట్రెండ్ లో నడిపిస్తూనే ఉన్నారు పవన్ ఫ్యాన్స్. మనం టార్గెట్స్ పెట్టుకోవద్దు.. మనం పెట్టింది మిగతా వాళ్లకి టార్గెట్ అవ్వాలనే రేంజ్ లో ట్రెండ్ సృష్టించారు. వాడు నా ఫ్యాన్ నేను చెప్పిన ఒక్కటే.. నా ఫ్యాన్ చెప్పిన ఒక్కటే అన్న పవన్ డైలాగ్ ను ఫాలో అవుతూ గబ్బర్ సింగ్ సోషల్ మీడియా రికార్డులను ఎవరూ ఆపలేరని పవన్ తరుపున చెప్పేస్తున్నారు.

పవర్ స్టార్ పవర్..

గబ్బర్ సింగ్ సినిమా గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న హడావిడి చూసిన దర్శకుడు హరీష్ శంకర్ … ఈరోజు మళ్లీ సినిమా రిలీజ్ అయిన ఫీలింగ్ కలుగుతోందని సంతోషం వ్యక్తం చేశాడు. బొమ్మ వచ్చి ఎనిమిదేళ్లయినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అన్నట్లు ఉందన్నారు. అది పవర్ స్టార్ పవర్, స్టామినా అంటూ ట్వీట్ చేశారు.

మ్యూజికల్ ఫైర్..

గబ్బర్ సింగ్ సినిమా హిట్ లో మ్యూజిక్ కు చాలా క్రెడిట్ దక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులతో స్టెప్పులు వేయించడంతో పాటు.. సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయింది. గబ్బర్ సింగ్ .. గబ్బర్ సింగ్.. అంటూ పవన్ ఫ్యాన్స్ కోరుకున్న దానికి మించిన రేంజ్ లో సాంగ్ ఇచ్చిన దేవి.. అదే సమయంలో శృతి హాసన్, పవన్ కళ్యాణ్ ల మధ్య రొమాంటిక్ సాంగ్స్ కంపోజ్ చేసి.. ఈ ఆల్బమ్ ద్వారా రికార్డు సృష్టించాడు. కాగా సినిమా రిలీజ్ అయి ఎనిమిదేళ్లు అవుతున్న సందర్భంగా.. అమెరికాలో గబ్బర్ సింగ్ పాటపై ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ను షేర్ చేశాడు దేవి.

Advertisement

Next Story