గడ్చిరౌలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. నెత్తురోడిన దండకారణ్యం

by Anukaran |   ( Updated:2021-05-20 22:57:39.0  )
గడ్చిరౌలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. నెత్తురోడిన దండకారణ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో కాల్పులమోత కలకలం రేపింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. గడ్చిరౌలి జిల్లాలోని ఈటపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు కాల్పులు జరిపగా.. 13 మంది మావోయిస్టులు మృతి చెందారని గడ్చిరౌలి డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఈటపల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story