మనుషులే చంపారా? లేదంటే కోతులే చంపాయా?

by srinivas |   ( Updated:2021-03-16 02:24:59.0  )
మనుషులే చంపారా? లేదంటే కోతులే చంపాయా?
X

దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన 7ఏళ్ల బాలుడు విగతజీవిగా కనిపించాడు.

ఆదివారం మధ్యాహ్నం మెల్లెంపూడిలో తన ఇంటి సమీపంలో 3గంటల ప్రాంతంలో బాలుడు భార్గవ్ తేజ అదృశ్యమయ్యాడు. దీంతో అదృశ్యమైన బాలుడికోసం అన్వేషణ ప్రారంభించారు. కానీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు ఆదివారం సాయంత్రం 8గంటల ప్రాంతంలో తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు లో భాగంగా పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టగా.., అదృశ్యమైన బాలుడు భార్గవ్ తేజ శవమై ఇంటి సమీపంలో చెట్లపొదల్లో విగతజీవిగా కనిపించాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు భాగవానియా నాయక్‌, అమల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అయితే బాలుడి మృతి చెందిన తీరుపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే భార్గవ్ ను కొట్టి చంపారని అంటున్నారు. కానీ పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. బాలుడిపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా కోతుల్ని చంపేసి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్లెంపూడి పరిసర ప్రాంతాల్లో జామతోటలు, అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో అక్కడ కోతుల బెడద ఎక్కువ ఉన్నాయని గ్రామస్తులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఆ ఆకోణంలో విచారణ వేగవంతం చేశామని, ఎవరు ఏం చెప్పినా విచారణ పూర్తయ్యే వరకు బాలుడి మరణంపై స్పష్టత ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. కాగా బార్గవ్ తేజ మరణాన్ని చేధించేందుకు క్లూస్ టీమ్, డాగ్స్ స్వ్కాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story