- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో కరోనా @ 572
ఆంధ్రప్రదేశ్‌పై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి నిద్రపట్టనివ్వడం లేదు. వైద్య నిపుణుల సూచనలు, సీఎం సమీక్షలు, లాక్‌డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, ఏమాత్రం సత్ఫలితాలనిచ్చినట్టు కనిపించడం లేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఏపీలో గత 24 గంటల్లో జరిగిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో 38 కేసులు నమోదైనట్టు ప్రకటించింది. దీంతో ఏపీలో ప్రస్తుతం 572 కరోనా కేసులు నమోదైనట్టు ప్రకటించింది. కరోనా బారిన పడి 523 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించింది. అలాగే 35 మంది రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ నయమై ఇళ్లకు చేరినట్టు ప్రకటించింది. ఏపీలో కరోనా కారణంగా 14 మంది మృతి చెందారని వెల్లడించింది.
నిన్న ఉదయం 9 నుంచి నేటి ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల్లో అత్యధికంగా కర్నూలు నుంచి 13 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు నుంచి 6 కొత్త కేసులు బయటపడ్డాయి. అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి చెరి ఐదు కేసులు నమోదు కాగా, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి చెరి నాలుగు కేసులు చొప్పున నమోదయ్యాయి. కడపలో ఒకరికి కరోనా సోకినట్టు బయటపడింది.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చెరి 126 కేసులు నమోదై కలకలం రేపుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 64 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 52, ప్రకాశం 42, కడప 37, పశ్చిమగోదావరి 34, చిత్తూరు 28, అనంతపురం 26, వైజాగ్ 20, తూర్పుగోదావరి జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.
కాగా, ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన పేషెంట్ల తాలూక ఇళ్ల ప్రాంతాలను రెడ్ అలెర్ట్ జోన్‌లో ఉంచామని ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వారితో సంబంధాలు నెరపిన వారందర్నీ క్వారంటైన్‌కి తరలించి, వారిపై నిఘా ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
tags: corona virus, covid-19, arogyaandhra, twitter, health department