ఆ రంగాలపై కరోనా ఎఫెక్ట్ లేదు : నౌక్రీ డాట్ కామ్ సర్వే

by Harish |   ( Updated:2020-05-28 04:05:10.0  )
ఆ రంగాలపై కరోనా ఎఫెక్ట్ లేదు : నౌక్రీ డాట్ కామ్ సర్వే
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశంలో ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో కంపెనీలు తెరుచుకుంటున్నాయి. ఈక్రమంలో గత కొద్ది రోజులుగా కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుపై ప్రముఖ ఉద్యోగ కల్పన వెబ్‌సైట్ నౌక్రీ డాట్ కామ్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 50 వేల మంది పాల్గొన్నారు. ఇందులో ఉద్యోగుల తొలగింపు గురించి 60 శాతం మంది స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేదు. అలాగే, 40 శాతం మంది.. కంపెనీలు ఉద్యోగులను తొలగించే ఛాన్స్ లేదని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది లాక్‌డౌన్ సమయాన్ని నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. ఫార్మా, ఆరోగ్య, ఐటీ రంగాల్లో కరోనా వైరస్ ప్రభావం ఏ మాత్రం చూపించలేదని 29 శాతం అభిప్రాయపడ్డారు. ఇదివరకటి కంటే మెరుగైన విద్యను అభ్యసించాలని 70 శాతం మంది వ్యక్తులు చెప్పారు. ఉద్యోగుల జీతాలు, ఇతర అలవెన్సులను తగ్గిస్తారని 16 శాతం మంది వ్యక్తులు భావిస్తున్నారు. ఇక, రానున్న కొద్ది రోజులు వేతనాల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని 63 శాతం మంది స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed