- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జాబిల్లి మీద 4జీ నెట్‌వర్క్
దిశ, వెబ్‌డెస్క్: చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టి అప్పుడే 51 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ అక్కడ మానవ మనుగడ సాధ్యమా? కాదా? అన్న విషయంలో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే 2028 వరకు చంద్రుడిపై మానవు ఉనికి సాధ్యపడవచ్చని నాసా భావిస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో అక్కడ నాసా లూనార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమైంది. మరి ఆస్ట్రోనాట్స్ అక్కడ మొబైల్ వినియోగించవచ్చా? వారికి కమ్యూనికేషన్ ఎలా? అక్కడ ఫోన్ 4జీ నెట్‌వర్క్ ఉంటుందా? అంటే త్వరలోనే అక్కడ 4జీ నెట్‌వర్క్ రాబోతుంది. ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా సంస్థ ఇందుకోసం డీల్ కుదుర్చుకుంది.
2028 నాటికి చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేసుకోవాలన్నది ‘నాసా’ లక్ష్యమని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ తెలిపారు. అప్పటిలోగా వ్యోమగాములు చంద్రునిపై నివసించేందుకు వీలుగా పనులు ప్రారంభించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాలని అన్నారు. తాము చంద్రునిపై ఎక్కువ కాలం ఉండేందుకు విద్యుత్ వ్యవస్థలు, నివాస సామర్థ్యం అవసరమన్నారు. ఇందుకోసం నాసా ‘నోకియా ఆఫ్ అమెరికా’తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే.. చంద్రునిపై సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు నాసా, నోకియాలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కోసం నోకియాకు 14.1 మిలియన్ డాలర్ల నిధులు నాసా అందించనుంది. అంతరిక్ష పరిశోధన, అభివృద్ధి దిశగా కొనసాగేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది. నోకియా మొదట అక్కడ 4జీ/ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను నిర్మించి, ఆ తర్వాత దాన్ని 5జీకి విస్తరించనుంది. చంద్రునిపై కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్ ఫోన్స్ వినియోగించుకోవచ్చు.