- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిద్దిపేట జిల్లాలో పాముకాటుకు చిన్నారి బలి
by Sumithra |

X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుకు చిన్నారి బలైంది. కోహెడ మండలం బస్వాపూర్ సమీపంలోని జ్యోతిరామ్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన రాజు నాయక్ కుటుంబ సభ్యులు శనివారం రాత్రి కలిసి భోజనం చేశారు. తర్వాత ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి పెద్ద కూతురు నందిని కేకలు వేయడంతో నిద్రలేచిన తండ్రి రాజు నాయక్.. ఇంట్లో లైట్ వేయడంతో కూతురు బానోతు ఉషశ్రీ (4) తలపై పాము కాటు ఉన్నట్లు గుర్తించారు. దీంతో హుటాహుటినా చిన్నారిని సిద్దిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.
Next Story