ఢిల్లీలో థర్డ్ వేవ్‌లో రోజుకు 37వేల కేసులు

by Shamantha N |
ఢిల్లీలో థర్డ్ వేవ్‌లో రోజుకు 37వేల కేసులు
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో ఢిల్లీలో రోజుకు 28వేల కేసులు రిపోర్ట్ అయ్యాయి. థర్డ్ వేవ్‌లో ఈ కేసులు 37వేలకు చేరవచ్చని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంచనా వేశారు. అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో ఈ కేసులను దృష్టిలో పెట్టుకుని సన్నద్ధం కావాలని నిర్ణయించామని శనివారం వివరించారు. బెడ్లు, ఐసీయూలు, చిన్నపిల్లల బెడ్లు, ఆక్సిజన్, మెడిసిన్స్ 37వేల కేసుల లక్ష్యంగా సమకూర్చే ప్రణాళికలు వేశామని వెల్లడించారు. ఇందులో చిన్నారుల కోసం ఎన్ని కేటాయించాలన్నది నిర్ణయించాల్సి ఉన్నదని, అలాగే, కరోనా సోకిన పిల్లల కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని వివరించారు.

సెకండ్ వేవ్‌లో హాస్పిటళ్లకు ఆక్సిజన్ లేక, పేషెంట్లకు బెడ్లు దొరక్క ఎన్నో వెతలను చూశామని, అందుకే థర్డ్ వేవ్‌ వస్తే అలాంటి దుస్థితి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 420 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ స్టోరేజీ కెపాసిటీని పెంచామని, 25 ఆక్సిజన్ ట్యాంకర్లు కొనుగోలు చేస్తు్న్నామని, 64 చిన్న ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో రెండు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకూ యోచిస్తున్నామని సీఎం కేజ్రీవాల్ అన్నారు.

Advertisement

Next Story