- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో 70 వేల మార్క్ దాటిన కరోనా
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 70 వేల మార్క్‌ను దాటాయి. గడిచిన 24 గంటల్లో 3,604 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 70,756 కు చేరింది. సోమవారం వైరస్ బారిన పడి 87 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,293కి చేరినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 22,455 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 46,008గా ఉంది. కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 1,230 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,401 చేరగా, మరణాల సంఖ్య 868కు పెరిగింది. ప్రధానంగా రాజధాని ముంబాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొత్త కేసుల నమోదు, మరణాలు ఇక్కడే ఎక్కవ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక గుజరాత్ 8,541 కేసులు, 513 మరణాలతో రెండో ప్లేస్‌లో కొనసాగుతోంది. కాగా, దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మే 17న ముగుస్తుంది. రెడ్‌జోన్ ఏరియాలో మినహా మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు మరింత సడలించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.