- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతిపెద్ద మురికివాడ ధారావి @344 కేసులు
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 14 కొత్త కేసులు నమోదు కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 344కు చేరింది. ఇప్పటి వరకు అక్కడ 18 మంది మృత్యువాతపడ్డారు.
ఇక, మహారాష్ట్ర.. కేసుల నమోదు, మరణాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. పాజిటివ్ కేసులు దాదాపు 10 వేలు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 597 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 9,915కు పెరిగింది. తాజాగా 32 మంది వైరస్ ధాటికి బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 432కు చేరింది.
ఇక, రాష్ట్ర రాజధాని ముంబై కరోనా విలయం సృష్టిస్తోంది. రోజురోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తాజాగా బుధవారం ఒక్క రోజే ముంబైలో 475 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. దీంతో కేసుల సంఖ్య 6,644కు చేరింది. మొత్తం మరణాల్లో 26 ఇక్కడే చోటుచేసుకున్నాయి.
Tags: coronavirus, maharashtra, mumbai, dharavi, positive cases