పెద్దపల్లిలో 34 కరోనా కేసులు

by Sridhar Babu |   ( Updated:2020-07-18 10:49:43.0  )
పెద్దపల్లిలో 34 కరోనా కేసులు
X

దిశ, పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా శనివారం ఒక్కరోజే పెద్దపల్లి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఇందులో రామగుండం పట్టణంలో 21 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ 140 మంది పాజిటివ్ నిర్ధారణ అయిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండగా, 522 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.


👉 Read Disha Special stories


Next Story