- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణలో 30వేలు దాటిన కరోనా కేసులు

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 1,410 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30,946కి చేరింది. ఇవాళ ఏడుగురు చనిపోగా, మొత్తం కరోనా మృతుల సంఖ్య 331గా ఉంది. హైదరాబాద్ పరిధిలోనే 918 పాజిటివ్ కేసులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో వివరించింది. గురువారం 913 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,192గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 12,423 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 125, సంగారెడ్డి 79, మేడ్చల్ 67, వరంగల్ అర్బన్ 34, కరీంనగర్ 32, భద్రాద్రి కొత్తగూడెం 23, నల్గొండ 21, నిజామాబాద్ 18, మెదక్ 17, ఖమ్మం 12, సూర్యాపేట 10, మహబూబ్‌నగర్ జిల్లాలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story