గంజాయి సేవిస్తున్న ముగ్గురు అరెస్ట్.. అందులో ఒకరు మైనర్

by Sridhar Babu |   ( Updated:2021-12-11 20:12:49.0  )
marijunna
X

దిశ, మహముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలోని యామన్ పల్లి వద్ద గంజాయితో దొరికిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అరుణ్ గౌడ్ తెలిపారు. యామన్ పల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించిన కాటారంకు చెందిన దుర్గం నందకిశోర్, నర్సింగపూర్ కు చెందిన సాయితేజ, మరో మైనర్ బాలుడు తిప్పనపల్లిని అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మహముత్తారం ఎమ్మార్వో వినయ్ సాగర్ ముందు గంజాయిని, బైక్ ను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. గంజాయి విక్రయించనా, సేవించినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. అరెస్ట్ చేసిన నందకిశోర్, సాయితేజలను రిమాండ్ కు తరలించామని, మైనర్ బాలుడిని వరంగల్ జువైనల్ హోమ్ కి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story