- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హోమ్ మేడ్ బ్యాట్‌మొబైల్ కారు
దిశ, వెబ్‌డెస్క్: బ్యాట్‌మన్ సినిమాలంటే ఇష్టపడని యూత్ చాలా తక్కువ మంది ఉంటారు. బ్యాట్‌మన్ వాడే ‘బ్యాట్ మొబైల్ కారు’ మరింత ప్రత్యేకంగా ఉండి, చూడగానే ఫిదా అయిపోతుంటాం. కాగా, వియత్నాంకు చెందిన 23 ఏళ్ల యువకునికి కూడా ఆ కారన్నా.. బ్యాట్‌మన్ సిరీస్ సినిమాలన్నా.. ఎంతో ఇష్టం. అంతగా ఇష్టపడటంతో ఎలాగైనా అలాంటి కారు తయారు చేయాలనుకున్నాడు. అందుకోసం 10 నెలలు కష్టపడి 14 లక్షల 67 వేల రూపాయలు ఖర్చుతో సొంతంగా బ్యాట్ మొబైల్ కారు రూపొందించాడు.
నూయెన్ డాగ్ చుంగ్.. హనోయ్‌లోని ఓ కాలేజీలో ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ సృష్టించిన ‘ద డార్క్ నైట్’ సినిమాకు వీరాభిమాని. ఇక బ్యాట్ మొబైల్ అంటే చచ్చేంత ఇష్టం. ఆ బ్యాట్ మొబైల్ కారును రూపొందించడం కోసం రేయింబవళ్లు కష్టపడ్డాడు. చివరకు అనుకున్నది సాధించి.. హనోయ్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. 4 సిలిండర్లు కలిగివున్న ఈ హోమ్ మేడ్ బ్యాట్ మొబైల్ కారుకు 400 సీసీ ఇంజన్‌ను అమర్చాడు. టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు. సస్పెన్షన్ సిస్టమ్ విషయానికొస్తే.. ఫ్రంట్ 4 షాక్ అబ్సార్బర్స్, రేర్ 2 షాక్ అబ్సార్బర్స్ ఉన్నాయి. జెట్ ఇంజిన్ ఎక్జాస్ట్ లేదు కానీ, బ్యాట్ మొబైల్ షేప్‌లో మార్పు రాకూడదని.. జెట్ ఇంజన్ మోడల్‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో ఇద్దరు వ్యక్తులు హాయిగా కూర్చోవచ్చు. ఈ కారుకు మరిన్ని హంగులు చేర్చాల్సి ఉందని, ఇంటీరియర్ ఇంకా పూర్తి కాలేదని అంటున్నాడు చుంగ్. చాలా వరకు డొమెస్టిక్ పార్ట్స్ ఉపయోగించాడు. కారుకు ఉపయోగించిన టైర్లు వియత్నాంలో దొరకవు. అలాంటి రేర్ ఐటెమ్స్‌ను మాత్రం అమెరికా, సౌత్ కొరియాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు.
Read Also…