బిగ్ బ్రేకింగ్.. సౌతాఫ్రికా పై భారత్ భారీ విజయం

by Mahesh |   ( Updated:2023-11-05 15:11:51.0  )
బిగ్ బ్రేకింగ్.. సౌతాఫ్రికా పై భారత్ భారీ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, సౌతాఫ్రికా జట్లమధ్య జరుగుతున్న 37వ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. రోహిత్ 40, శ్రేయస్ 77, కోహ్లీ 101*, జడేజా 29, సూర్య 22 పరుగులతో రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. అనంతరం 327 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వచ్చిన వారిని వచ్చినట్లే పెవిలియన్ పంపుతూ.. వరుస వికెట్లు తీసుకున్నారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో సౌతాఫ్రికా బ్యాటర్లను కుదేలు చేశాడు. అలాగే షమీ 2 వికెట్లు, కుల్దీప్ 2 వికెట్ తీసుకున్నారు. దీంతో సౌతాఫ్రికా 83 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జెన్ సన్ చేసిన 14 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. ముఖ్యంగా ఏడుగురు బ్యాటర్లు కేవలం సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు. దీంతో సౌతాఫ్రికా జట్టు ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.

Advertisement

Next Story