ICC World Cup 2023: సాగిపో నాయకా.. వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా (వీడియో)

by Vinod kumar |   ( Updated:2023-11-11 15:50:54.0  )
ICC World Cup 2023: సాగిపో నాయకా.. వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దుమ్ములేపుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో కూడా ఓడిపోని ఏకైక జట్టు భారత్ మాత్రమే కావడం గమనార్హం. దీంతో ఇదే ఊపులో టీమిండియా ఈ సారి ప్రపంచకప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా భారత జట్టు చివరగా 2011లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే

వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా ఆరు విజయాలతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. భారత జట్టు ఆడుతున్న తీరు.. రోహిత్ శర్మ కెప్టెన్సీతోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణిస్తుండటం.. అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. దీంతో ఈసారి టీమిండియా కప్పు కొట్టాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. 2011 నుంచి ఆతిథ్య జట్టే వరల్డ్ కప్ గెలుస్తుండటంతో.. ఈ సెంటిమెంట్ కూడా మనకు కలిసిరానుంది. భారత విజయాల్లో రోహిత్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, షమీ, కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జడేజా, సూర్య కూడా ఓ చేయి వేస్తున్నారు. అయితే రోహిత్ శర్మ వరల్డ్ కప్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆరు మ్యాచ్‌లకు గానూ రెండింట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రోహిత్ సారథ్యంలో.. భారత్ వరల్డ్ కప్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Advertisement

Next Story