- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ICC World Cup 2023: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. కుంబ్లే, యువరాజ్ రికార్డు బ్రేక్
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్ 2023 సింగిల్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (16) పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జడ్డూకు ముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్‌ల ఇద్దరి పేరిట ఉండేది. 1996 వరల్డ్‌కప్‌లో కుంబ్లే, 2011 వరల్డ్‌కప్‌లో యువరాజ్ 15 వికెట్లు పడగొట్టాడు.
జడ్డూ వీరిద్దరి రికార్డును అధిగమించాడు. ఈ విభాగంలో కుల్దీప్ (14 వికెట్లు).. జడేజా, కుంబ్లే, యువరాజ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. కాగా, వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు జహీర్ ఖాన్ పేరిట ఉంది. 2011 ఎడిషన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.