- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండువేల సంవత్సరాల నాటి రథం లభ్యం.. ఎక్కడంటే
దిశ, ఫీచర్స్ : పురాతన కాలంలో రాజులు అందంగా అలంకరించిన రథాలపై ఊరేగేవారనేది నిజమే అనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. ఇటలీలోని పురావస్తు ప్రదేశం పొంపై(Pompeii)లో 2 వేల ఏళ్ల కిందటి రథాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెలికితీశారు. నాలుగు చక్రాలతో అందంగా అలంకరించబడిన ఈ రథాన్ని గుర్రాలు లాగేవని నిర్ధారించారు. ఎందుకంటే 2018లో ఈ ప్రదేశానికి దగ్గరలో మూడు గుర్రాల అవశేషాలు లభ్యమయ్యాయి. ఇనుము, కాంస్యం, కలపతో ఈ రథాన్ని రూపొందించినట్లు అంచనా వేస్తున్న శాస్త్రవేత్తలు.. 21వ శతాబ్దంలో ఈ ప్రదేశం (పొంపై) కొలాప్స్ అయ్యుండొచ్చని చెప్తున్నారు.
కాగా రాజుతో పాటు రాజకుటుంబీకులు ఈ రథాల్లో తిరిగేవారని, ఇది అప్పటి కాలం ‘లంబోర్ఘిని’ వెహికల్ అని పలువురు ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే పురాతన రథాలను గుర్తించడం అసాధారణ ఆవిష్కరణ అని, ఆ కాలంలోనే ఇంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాడేవారని మనం అర్థం చేసుకోవాలని పొంపై ఆర్కియాలజికల్ సైట్ డైరెక్టర్ మస్సిమొ ఒసన్న పేర్కొన్నారు. ఇక పొంపై ఆర్కియాలజికల్ సైట్‌ను యునైటెడ్ నేషన్స్(UN) స్పెషలైజ్డ్ ఏజెన్సీ యునెస్కో(UNESCO).. ప్రపంచ వారసత్వ కేంద్రంగా(WHS) గుర్తించగా.. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశంలో పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.