- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్క రోజులో 1975 కొత్త కేసుల నమోదు ..
– దేశవ్యాప్తంగా 26,917 పాజిటివ్‌లు
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ దేశంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో ఒక్క రోజు వ్యవధిలో 1975 కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం నాటికి మొత్తం పాజిటివ్ కేసులు 24,942 ఉంటే, ఆదివారం సాయంత్రానికి అవి 26,917కు చేరుకున్నాయి. కొత్తగా పెరిగిన 1975 కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 811 ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 47 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 826కు చేరుకుంది. ఇందులో 13 మంది ముంబయి నగరానికి చెందినవారే. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే గరిష్ట స్థాయిలో 704 మంది డిశ్చార్జయ్యారు. దీంతో దేశం మొత్తంమీద యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20,177గా ఉంది. ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటితే తెలంగాణ కూడా ఇప్పుడు తొమ్మిదవ రాష్ట్రంగా వాటి సరసన చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజులో 81 మంది కొత్త పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1097కు చేరుకుంది.
భారత్ :
మొత్తం కేసులు : 26,917
మృతులు : 826
రికవరీ : 5914
తెలంగాణ :
మొత్తం కేసులు : 1,001
మృతులు : 25
రికవరీ : 316
ఆంధ్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 1097
మృతులు : 31
రికవరీ : 236
Tags : Corona, 1975 cases, one day, discharge, Telangana, AP