- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసోలేషన్ లో ఉన్న బాలికపై అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాధి సోకిన 14 ఏండ్ల బాలికపై లైంగిక దాడి చేసిన ఘటన దేశ రాజధానిలో సంచలనం రేపింది. వైరస్ సోకిందని పట్టించుకోకుండా ఓ ప్రబుద్ధులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. జూన్ 15 రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాళ్లోకి వెళితే.. ఢిల్లీలోని చత్తార్‌పూర్‌లో ఇటీవల 10 వేల బెడ్స్‌తో ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కరోనాతో ఓ మైనర్ బాలిక అదే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ నెల 15న రాత్రి బాధితురాలు బాత్ రూమ్ కి వెళ్లడం గమనించిన ఓ యువకుడు, అతడి స్నేహితుడు సహకారంతో ఆమెపై లైంగిక దాడి చేశాడు.
అయితే, అదే రాత్రి జరిగిన దారుణంపై మైనర్ బాలిక అక్కడి ఐటీబీటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలిని వేరే ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అనంతరం వారికి కరోనా సోకే అవకాశం ఉండడంతో మరో కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. కరోనా బాధితురాలిపై లైంగిక దాడి కేసులో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ ఆస్పత్రుల్లోనే ఆడపిల్లలకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రతి పక్షాలు మండిపడుతున్నాయి. ఏకంగా ఐటీబీటీ అధికారులు పర్యవేక్షణలో ఉన్న అతి పెద్ద ఆస్పత్రిలో ఇటువంటి అఘాయిత్యం జరగడం గమనార్హం.