నాన్న సపోర్ట్ లేకపోతే "ఢీ" లేదు: విష్ణు

by Shyam |
నాన్న సపోర్ట్ లేకపోతే ఢీ లేదు: విష్ణు
X

“ఢీ”.. విష్ణు, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. విష్ణు, శ్రీ హరి, వేణు మాధవ్, జేపీ కామెడీ వినకు హైలెట్ గా నిలుస్తుంది. కాగా ఈ చిత్రం విడుదలై 13 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా … సినిమాతో ముడిపడి ఉన్న అనుభవాలను పంచుకున్నారు హీరో విష్ణు. ఏప్రిల్ 13, 2007 లో ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని తెలిపారు. మా నాన్న మోహన్ బాబు లేకపోతే ఈ సినిమా రిలీజ్ అయి ఉండేదే కాదన్నారు. అందుకే ముందుగా తండ్రికి ధన్యవాదాలు తెలిపిన విష్ణు… డైరెక్టర్ ను అభినందించారు. ఎంత గొప్ప కామెడీ ఫిల్మ్ నా పెద్ద అన్నయ్యా అంటూ శ్రీను వైట్లను కొనియాడారు.” ఢీ 2″ ఎప్పుడు మరి అని ప్రశ్నించారు విష్ణు.

ఈ సందర్భంగా “ఢీ” సినిమా సెట్ లోని ఓ పిక్ షేర్ చేసిన శ్రీను వైట్ల… ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు. ప్రతీ రోజూ షూటింగ్ చాలెంజింగ్ గా ఉండేదని… ఈ సినిమాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా నిర్మాత ఎమ్ఎస్ఎన్ రెడ్డి కి , హీరో విష్ణుకు థాంక్స్ చెప్పారు. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించి తన కామెడీతో కితకితలు పెట్టిన రియల్ స్టార్ శ్రీహరి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రిలు ఇప్పుడు మనతో లేకపోయినా .. వీరిద్దరు కూడా సినిమా విజయవంతం కావడంలో కీలకంగా నిలిచారు.

Tags : Dhee, Vishnu, Genelia Deshmukh, Srinu Vaitla, Mohan Babu

Advertisement

Next Story