- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురపోరు.. తొలిరోజు 12 నామినేషన్స్ దాఖలు
దిశ సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికలకు మొదటి రోజు 12 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ల కోసం మున్సిపల్ కార్యాలయంలో 14 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కౌంటర్‌లో మూడు వార్డుల చొప్పున కేటాయించారు. ఒక్కొక్క కౌంటర్‌కు ఒక్కొ రిటర్నింగ్ అధికారి, ఒక సహాయ రిటర్నింగ్ అధికారిని నియమించారు. శుక్రవారం తెరాస నుండి 10, కాంగ్రెస్ పార్టీ నుండి రెండు, బీజేపి నుండి రెండు, సీపీఐ పార్టీ నుండి ఒక్కరూ నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ నుండి దాసరి రాజు19 వార్డు, గౌస్ మోహినొద్దీన్ చాంద్ 28వ వార్డు నుండి నామినేషన్ వేశారు. సీపీఐ నుండి ఇంజమిర్ నరేష్ 9వ వార్డు నుండి నామినేషన్ ఫైల్ చేశారు. బీజేపి నుండి పెర్క భాను 19వ వార్డ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తెరాస నుండి మల్యాల జ్యోతి 17వ వార్డ్, గుడాల సంధ్య 34వ వార్డు, కొండం కవిత 4వ వార్డ్, జావేద్ 28వ వార్డ్, వినోద్ గౌడ్ 5వ వార్డు, నీలం నరేష్ 27వ వార్డు, అడ్డగట్ల కావేరి 18వ వార్డు నుండి నామినేషన్లు వేశారు.