- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నియోజకవర్గానికి 104.40 కోట్ల రూపాయలు నిధులు మంజూరు..
దిశ, దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి జడ్పీ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేవరకద్ర నియోజకవర్గానికి 104.40 కోట్లు. నిధులు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఙతలు తెలియజేశారు. చిన్న చింతకుంట మండల ప్రజల చిరకాల కోరిక చిన్న చింతకుంట మండలం నుండి శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం వరకు రోడ్డు, బ్రిడ్జి , చెక్ డ్యామ్ కోసం 30 కోట్లు, కురుమూర్తి దేవస్థానం గుట్ట కింది నుంచి స్వామి వారి వరకు 11 కోట్లు మొత్తం 41 కోట్లు జీవో చాలా రోజుల క్రితమే తీసుకురావడం జరిగిందన్నారు.
కానీ గత 2 సంవత్సరాలు గా కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేక టెండర్ పిలవలేదని చేప్పుకోచ్చారు. కాగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి టెండర్ ప్రక్రియ ను కూడా పూర్తి చేశారని చెప్పారు. 15 రోజుల్లో మంచి రోజు చూసుకొని గౌరవ జిల్లా మంత్రులు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భూమి పూజ కార్యక్రమం కూడా జరుపుకోబుతున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలో రెండు లిఫ్ట్‌ల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళామన్నారు.
ఒకటి పేరూర్ లిఫ్ట్ , ఈ లిఫ్ట్ కింద పేరూర్ , వెంకంపల్లి , దాసర్లపల్లి , అమ్మాపూర్ & 6 గ్రామాలకు సంబంధించిన 2,500 ఎకరాలకు సాగునీరు రాక కోసం 51 కోట్లు మంజూరు చేయడం జరిగింది. టెండర్లు కూడా పూర్తి అయ్యాయని.. ఇది కూడా 15 రోజుల్లో ప్రారంభిస్తామని.. కనిమెట్ట – పాత జంగామాయపల్లి బ్రిడ్జి కోసం 12 కోట్ల 40 లక్షల తో కొత్తగా మంజూరు చేసుకున్నాంమని.. దీనిని కూడా త్వరలోనే మంత్రుల సమక్షంలో ప్రారంభించుకోబోతున్నాం అని అన్నారు. ఈ మూడు పనులకు సంబంధించి 104 . 40 కోట్లు నిధులు మంజూరు అయినట్లు ప్రజలకు తెలియాలని ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాము అని త్వరలోనే ఈ మూడు పనులును భూమి పూజలు చేసుకొని మంత్రుల సమక్షంలో పనులు ప్రారంభించబోతున్నాం అని ఎమ్మెల్యే తెలియచేసారు.