శిశు విక్రయాల గుట్టు రట్టు

by Sumithra |
శిశు విక్రయాల గుట్టు రట్టు
X

శిశు విక్రయాల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పోలీసుల విచారణలో ఏపీకి చెందిన 9మంది ఏజెంట్ల చిట్టా బయటపడింది. మగశిశువు ఖరీదు రూ.14లక్షలుగా ఈ ముఠా నిర్ణయించింది. తండాల్లో అధిక సంతానం ఉన్న పేదల నుంచి చిన్నారులను కొనుగోలు చేసి వారిని, సంతానం లేని దంపతులకు విక్రయిస్తారు. తల్లికి రూ. 70 వేలు ఇచ్చి, ఏజెంట్లకు రూ.లక్షల్లో మార్జిన్లను ఈ ముఠా ఇస్తోంది. దీనికంతటికీ సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటివరకు 14మంది శిశువులను అమ్మినట్టు సమాచారం. అయితే, మఠా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడనీ, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.


Next Story