శంషాబాద్‌లో బంగారం షాపులో చోరీ

by Sumithra |   ( Updated:2020-10-04 20:22:19.0  )

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని వెంకటరమణ జ్యువెలరీ షాపులో చోరీ జరిగింది. కస్టమర్లుగా వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు యాజమాని దృష్టిమళ్లించి 4జతల బంగారు గాజులను అపహరించుకుపోయారు. దుండగులు చోరీ చేసే విషయం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ రూ.4.50లక్షల వరకు ఉంటుందని యజమాని తెలిపాడు.



Next Story