- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాంద్యంపై దాటవేత!
దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, మందగమనంపై బీజేపీ దాటవేత ధోరణి అనుసరిస్తోందనీ, అందుకే బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులూ మాంద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో మాంద్యం పరిస్థితులు లేవని ఉంటే కోట్లు, జాకెట్లు ఎలా వేసుకోగలుగుతున్నామని బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ ఓ కార్యక్రమంలో ప్రశ్నించారు. నిరుడు మీడియాతో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లడుతూ సినిమాలు బాగా ఆడుతున్నాయి కాబట్టి మాంద్యం లేదనీ, రూ.120 కోట్ల సినిమాలు కలెక్ట్ చేస్తున్నాయని, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మూవీలు అద్భుతంగా ఆడుతున్నాయని చెప్పారు. ఉల్లిగడ్డల వినిమయంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మా ఇంట్లో అసలు ఉల్లిపాయలు తినబోమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు దేశ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించేవి కావని కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. వినిమయం దిగజారిందనీ, 45 ఏండ్ల గరిష్ట నిరుద్యోగముందని మొన్నటి ఆర్థిక సర్వే సైతం స్పష్టం చేస్తున్నది.
ప్రజల కొనుగోలుశక్తి పెరిగేనా?
దేశంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ నివేదికలేం చెబుతున్నాయో పరిశీలిద్దాం. 7.2 శాతం 45 ఏండ్ల నిరుద్యోగం ఉందని నివేదికలు తెలిపాయి. ఎప్పడూ లేని విధంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోయాయనీ, ఐటీ కంపెనీలు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయని స్పష్టం చేశాయి. బిస్కెట్ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తీసేయాని ఆ కంపెనీలు తెలిపాయి. వస్తు సేవల వినియోగం తగ్గిపోయిందని జీఎస్టీ వసూళ్లే స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల కొనుగోలుశక్తి పెంచేందుకు ప్రభుత్వ చర్యలు ఉండాలని ఆర్థిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వెల్త్ ట్యాక్స్ వేయాలని నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ చెప్పారు. కానీ, బడ్జెట్‌లో ఆ దిశగా చర్యలు కనబడలేదు. సినిమాలు ఆడితే, కోట్లు, జాకెట్లు కొనుగోళ్లు జరిగే మాంద్యం లేనట్టే అని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని విమర్శకులు చెబుతున్నారు. ఎందుకంటే మారుతున్న సంస్కృతి వల్ల కోట్లు జాకెట్లు కొంటున్నారు. కానీ, ధోతి, కుర్తాలు వేసుకుంటేనే మాంద్యం ఉన్నట్టు అన్న వాదనలో హేతుబద్ధతలేదని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఆర్థిక మంత్రిగా సుబ్రమణ్యం స్వామి?
ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్థికవేత్తలు లేరనీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ కొంత మేరకే బెటర్ అని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఓ డిబేట్‌లో చెప్పారు. అయితే, ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనీ, ప్రధాని మోడీకి ఎకనామిక్స్ తెలియదని సంచలన వ్యాఖ్యలూ చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే తనను ఆర్థిక మంత్రిని చేయాలని ఆయన కోరారు. ఇనకమ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని ఎప్పటి నుంచో సుబ్రమణ్యస్వామి చెబుతున్నారు. కానీ, కేంద్రం ఐటీ శ్లాబ్‌ల మార్పు, సంపన్నులకు కార్పొరేట్‌లకు వరాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం స్వామి ఆర్థిక మంత్రి అవుతారో, లేదో తెలియదు కానీ, ఆయన ఓ ఆర్థిక వేత్త కాబట్టి కనీసం ఆయన సూచనలనైనా ప్రభుత్వం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కాగా, దేశంలో ఆర్థిక వృద్ధిరేటు పడిపోయిందనీ, ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా దిగజారిందని అంతర్జాతీయ సంస్థలు ధృవీకరించడాని కంటే ముందే స్వామి చెప్పడం గమనార్హం.
అప్పటి స్థితిలోనే ఆర్థికం..
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందనీ, పాలసీకి పెరాలసిస్ వచ్చిందని, దాన్ని బాగు చేసేందుకు మోడీ ప్రభుత్వానికి కొంత సమయం కావాలని చెప్పారు. అయితే, ఆయన ఇప్పడు లేరు. కానీ, ప్రస్తుత పరిస్థితి కూడా అలానే ఉందని విమర్శకులు అంటున్నారు. అందుకు నిదర్శనం ప్రజల కొనుగోలు శక్తేనని చెబుతున్నారు. పార్లీ జీ బిస్కెట్ ప్యాకెట్‌లే కొనలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నప్పడు 350 లక్షల కోట్ల (5 ట్రిలియన్ డాలర్) ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి పెద్ద చర్యలతో ఇప్పటికే రాష్ట్రాలు, అసంఘటిత రంగాలకు నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో ఎల్ఐసీలో వాటాల అమ్మకం, ప్రయివేటీకరణకే రైట్..రైట్.. అంటున్న ప్రభుత్వం మాంద్యాన్ని గాడిలో పెట్టేందుకే చర్యలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు కోరుతున్నారు.
తెరమీదకు మళ్లీ వివాదాస్పద ‘ఎఫ్‌ఆర్‌డీఐ’
2017లో కేంద్రం తీసుకొచ్చిన ‘ఎఫ్‌ఆర్‌డీఐ’ బిల్లుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో దాన్ని కేంద్రం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ ఎఫ్‌ఆర్డీఐ బిల్లు తీసుకొచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందనీ, సరైన సమయంలో పార్లమెంటుకు తీసుకొస్తామని తెలిపారు. ఈ బిల్లుతో ప్రధానంగా నష్టపోయేది సామాన్య, మధ్యతరగతి డిపాజిటర్లు. బిల్లులోని బెయిల్ ఇన్ ప్రొవిజన్ ద్వారా డిపాజిటర్లకు తెలియకుండానే ఆ బ్యాంకు నష్టాన్ని పూడ్చేందుకు డబ్బులు తీసుకుంటారు. మరి కార్పొరేట్లకు రుణాలు ఇచ్చేప్పుడు డిపాజిటర్లను అడిగే రుణాలు ఇస్తున్నదా? ఈ ప్రభుత్వం చెప్పాలి. ఈ విషయమై అప్పట్లో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది.
నిన్న బీజేపీ ఎంపీ వీరేంద్రసింగ్ మాట్లాడుతూ 6.5 లక్షల గ్రామాలు దేశంలో ఉన్నాయని, బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసేవారందరూ గ్రామీణ ప్రాంతం వారేనని చెప్పారు. మరి వారి ఆర్థిక అభివృద్ధికి కేంద్రం ఏ మేరకు రుణాలు ఇస్తుందో చెప్పలేదు. ఒకవేళ కేంద్రం తీసుకొచ్చే ఎఫ్ఆర్డీఐ బిల్లుతో బ్యాంకులపై గ్రామీణ భారతానికి నమ్మకం సన్నగిల్లితే పరిస్థితి ఏంటో చెప్పాలి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ అవసరమైతే మరిన్ని బ్యాంకుల విలీనముంటుందని చెబుతున్నారు. బ్యాంకుల విలీనం జరిగితే రైతులు, గ్రామీణ కుటీర పరిశ్రమలు, వృత్తిదారులకు రుణాలిచ్చే బ్యాంకుల సంఖ్య తగ్గుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యమే ఉండదు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రజల కొనుగోలు శక్తి పెంపు, రైతులకు రుణాలు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన చర్యలు తీసుకోవాలే తప్ప సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ అంటూ అసలు మాంద్యమే లేదంటూ మాట్లాడొద్దని పలువురు అభిప్రాయపడుతున్నారు.