- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాలుగో తరగతి పాసైన 105 ఏళ్ల బామ్మ
by Shyam |

X
కేరళలోని కొల్లాం జిల్లా పాలకుళంకు చెందిన 105 ఏళ్ల భాగీరథి అమ్మ నాలుగో తరగతి పరీక్షల్లో 74.5 శాతం మార్కులతో పాసయ్యారు. గత నవంబర్‌లో కేరళ స్టేట్ లిటరసీ మిషన్ వారు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యంత పెద్ద వయస్కురాలైన అక్షరాస్యురాలిగా ఆమె రికార్డుకెక్కారు.
16 మంది మనమళ్లు, మనమరాళ్లు ఉన్న ఈ వయసులో ఆమెకు చదువు మీద మక్కువ ఉండటాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. మూడో తరగతిలో ఉండగా చదువు ఆపేసిన ఆమె ఇప్పుడు నాలుగో తరగతి పాసయ్యారు. తనకు ఓపిక ఉన్నంత వరకూ చదువుతూనే ఉంటానని ఆమె అన్నారు. పదో తరగతి వరకు పూర్తి చేయడం ఆమె లక్ష్యమని చెప్పారు. నిరక్షరాస్యులు, పాఠశాల చదువు మధ్యలో వదిలేసిన వాళ్లు, చదువు మీద ఆసక్తి ఉన్న వాళ్ల కోసం కేరళ విద్యా శాఖ ఈ కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీని ప్రారంభించి విద్య నేర్పిస్తోంది.
Next Story