గుడ్‌లక్ చేపకు.. జాంబియా ప్రెసిడెంట్ సంతాపం

by  |
గుడ్‌లక్ చేపకు.. జాంబియా ప్రెసిడెంట్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్ :
మనం పెంచుకున్న వాటితో మనకో బంధం ఏర్పడుతుంది. అవి మొక్కలైనా లేదా పెంపుడు జంతువులైనా కావచ్చు. వాటికేమైనా అయితే మనం తట్టుకోలేం. అలా ఓ యూనివర్సిటీ విద్యార్థులు 20 సంవత్సరాల పాటు అపురూపంగా పెంచుకున్న ఓ చేప చనిపోయింది. దీంతో సదరు యూనివర్సిటీ విద్యార్థులంతా ఆ చేపకు క్యాండిల్స్‌తో నివాళులు అర్పించారు. స్వయంగా ఆ దేశ (జాంబియా) అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ సంతాపం తెలియజేశారు.

జాంబియాలోని కాపర్బెల్ట్ విశ్వవిద్యాలయంలోని చెరువులో 20 ఏళ్ల నుంచి ఓ చేపను పెంచుతున్నారు. అలా ఆ క్యాంపస్‌లోనికి వచ్చిన విద్యార్థులకు ఆ చేపతో అనుబంధం ఏర్పడింది. అంతేకాదు, వారికి ఆ చేప అదృష్ట సూచకమని కూడా నమ్ముతారు. తాము పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు కూడా ఈ చేపనే కారణమని ఆ విద్యార్థులు నమ్మేవారు.

‘మాఫిషి’ అనే ఆ చేపను స్థానిక బెంబా భాషలో ‘బిగ్ ఫిష్’ అంటారు. ఈ చేప మరణంతో కాపర్బెల్ట్ వర్శిటీ విద్యార్థులు కూడా చాలా బాధపడ్డారు. దీంతో విద్యార్థులంతా కొవ్వొత్తులను వెలిగించి, క్యాంపస్ చుట్టూ నిలబడి చేపకు సంతాపం ప్రకటించారు. మాఫిషి వయసు 22 సంవత్సరాలు ఉంటుందని వర్శిటీ సైంటిస్టులు చెబుతున్నారు. సీబీయూ చెరువులో ఈ చేప 20 సంవత్సరాల నుంచి ఉంటోందని, అక్కడ పనిచేసే సిబ్బంది, ప్రొఫెసర్లు చెబుతున్నారు. మాఫిషిని ఖననం చేయకుండా ఎంబామింగ్ (కెమికల్స్ పూసి చేపని కుళ్లిపోకుండా ఉంచుతారు) చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని స్టూడెంట్స్ లీడర్ కసోండే తెలిపారు.


Next Story

Most Viewed