లోకేశ్… కొంచెమైనా పాప భీతి ఉండాలి: వైవీ సుబ్బారెడ్డి

by srinivas |
లోకేశ్… కొంచెమైనా పాప భీతి ఉండాలి: వైవీ సుబ్బారెడ్డి
X

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటు సమాధానం చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన శ్రీవారి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, “నారా లోకేశ్… ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకానికి రెండు వారాలకు ఓసారి టీటీడీ చైర్మన్ హాజరవడం ఆనవాయితీ. నేను కూడా ఆ హోదాలోనే వెళ్లాను. ఆ ఫొటోలో నా తల్లిగారు, నా అర్ధాంగి, టీటీడీ ఉద్యోగులు తప్ప నా బంధువులెవరూ లేరు. నీ ట్వీట్ అబద్ధం. ఇప్పటికైనా తప్పు తెలుసుకో. కొంచెమైనా పాప భీతి ఉండాలి” అంటూ ఘాటుగా సమాధానం చెప్పారు.

tags: ttd, ysrcp, tdp, twitter, yv subbareddy, nara lokesh

Advertisement

Next Story

Most Viewed