యజువేంద్ర చాహల్ పెళ్లికొడుకయ్యాడు

by  |
యజువేంద్ర చాహల్ పెళ్లికొడుకయ్యాడు
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రేయసి, కాబోయే భార్య ధనశ్రీ వర్మతో పెళ్లి నిశ్చయం అయ్యిందని, ఇరు కుటుంబాలు రోకా వేడుకల్లోనూ పాల్గొన్నారని సోషల్ మీడియాలో శనివారం వెల్లడించాడు. ట్విట్టర్‌లో ఇద్దరి ఫొటో అప్‌లోడ్ చేసి ‘ఇరు కుటుంబాల సమక్షంలో రోకా సెర్మనీ జరిగింది’ అని పేర్కొన్నాడు.

దీంతో టీం ఇండియా, చాహల్ ఫ్యాన్స్ అతడిని అభినందనల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే చాహల్‌కు కాబోయే భార్య కూడా సోషల్ మీడియా సెలెబ్రిటీనే. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వృత్తిరిత్యా డాక్టర్ అయిన ధనశ్రీ యూట్యూబ్‌లో తన కొరియోగ్రఫీ వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. మరో వారం పదిరోజుల్లో టీం ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లనున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న చాహల్ కూడా యూఏఈ వెళ్లాల్సి ఉన్నందున అంతకు ముందే అతడి కుటుంబ సభ్యులు రోకా సెర్మనీ జరిపినట్లు సమాచారం.


Next Story